నిఖిల్ ని చెట్టుకు కట్టేసి కొట్టి కళ్ళల్లో కారం పెట్టారు!
on Aug 9, 2022
ఆలీతో సరదాగా షో ప్రతీ వారం సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇక ఈ వారం కార్తికేయ హీరో నిఖిల్, డైరెక్టర్ చందు మొండేటి వచ్చారు. ఈ షోలో ఎన్నో ఇంటరెస్టింగ్ టాపిక్స్ కూడా చెప్పేసారు. నిఖిల్ తన చిన్నప్ప్పుడు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని చెప్పి అందరినీ నవ్వించాడు. షోలే సినిమా అంటే చిన్నప్పుడు నిఖిల్ కి చాలా ఇష్టం అట. షోలే సినిమా చూస్తూనే అన్నం తినేవాడట. ఐతే ఒక రోజు వాళ్ళ అమ్మ టీవీ పెట్టక పోయేసరికి ఆరోజు అన్నం తినడం మానేసాడట.
ఐతే వాళ్ళ అమ్మ అన్నం తింటుంటే టీవీ ఎందుకు పెట్టరు అనే కోపంతో వాళ్ళ అమ్మ ప్లేట్ లో ఉన్న మటన్ పీస్ విసిరి టీవీ పగలకొడదామని అనుకుని విసిరేసరికి వాళ్ళ తాత క్యాచ్ పట్టుకున్నాడట దాంతో టీవీ పగిలిపోకుండా మిగిలిపోయింది. కానీ తాను చేసిన పనికి వాళ్ళ అమ్మా, పిన్ని తీసుకెళ్లి చెట్టుకు కట్టేసి కంట్లో కారం పెట్టేశారంట.
ఇదంతా విన్న చందు మొండేటి కూడా తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కూడా అంతే అని చెప్పుకొచ్చాడు. చీపురు, చేట, చెప్పులు, బెల్ట్ తీసి బాధేసిందట ఒక రోజు. ఇలా చిన్నప్పుడు వాళ్ళ వాళ్ళ అమ్మల చేతుల్లో తిన్న తిట్ల గురించి, కొట్టించుకున్న సంగతులు చెప్పి చిన్నప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. షోలే అనేసరికి ఆలీ కూడా తన లైఫ్ లో ఇన్సిడెంట్ చెప్పుకొచ్చారు. షోలే మూవీ పెట్టి మ్యూట్ చేస్తే ప్రతి ఒక్కరి డైలాగ్ టకటకా చెప్పేస్తానని చెప్పుకొచ్చారు. షోలే ఫీవర్ ఏ తరాన్నైనా అలా చుట్టేస్తూనే ఉంటుంది.